ఈ ఏడాది సంక్రాంతికి "శతమానంభవతి"లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బోణీ కొట్టిన శర్వానంద్ ను , తదుపరి "రాధా" రూపంలో అపజయం పలకరించింది. హాస్యానికి పెద్ద పీట వేసి విజయాలు దక్కించుకొంటున్న మారుతి దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తాజ విడుదల "మహానుభావుడు" హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అతి శుబ్రత అనే విపరీత మనస్థత్వంతో, వింత వింత విన్యాసాలు చేసే హీరో పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని శర్వానంద్ ను ప్రశంసిస్తున్నారు. "గమ్యం", "ప్రస్థానం" చిత్రాల ద్వారా మంచి ప్రతిభ గల యువ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, "రన్ రాజా రన్". "ఎక్స్ ప్రెస్ రాజా", "రాజాధి రాజా" చిత్రాలలో తనలోని హాస్య రస పోషణను కూడా నిరూపించుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన "శతమానంభవతి" ఓవర్ ఆల్ గా 50 కొట్ల కలెక్షన్స్ వసూలు చేసి హీరోగా శర్వానందుకు సరి కొత్త మార్కెట్ ను తెచ్చిపెట్టింది. రెండు భారీ చిత్రాల మధ్య దసరాకు విడుదలైన "మహానుభావుడు" 35 - 40 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని పరిశ్రమ వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏ సంకోచం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా భరొసా ఇస్తున్నారు ప్రేక్షకులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి