
భారీ చిత్రాల దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో ద్విభాషా చిత్రంగా విడుదలైన "స్పైడర్" చక్కని కలెక్షన్స్ రాబడుతుంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినా, కలెక్షన్స్ మాత్రం భారీగానే కొల్లగొడుతుంది. రెండు రోజులకే 85 కోట్లు సుమారు వసూలు చేసి, 100 కోట్ల దిశగా పయనిస్తుంది. హీరో, విలన్ పాత్రల వైవిద్య సృష్టి, చిత్రీకరణ, సాంకేతిక హంగుల వినియోగంలో అంతర్జాతీయ స్థాయి పని తీరు కనబరిచాడు దర్శకుడు మురుగ దాస్. ప్రాంతీయ భాషా అగ్ర హీరోల హీరోయిజంపై ఒక బలమైన ముద్ర ఏర్పడి పోయి వున్న మాస్ ప్రేక్షకులలో ఈ వినూత్న తరహాపై భిన్న స్వరాలు వినిపించాయి. తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంచి సందేశాన్ని అత్యున్నత రీతిలో దర్శకుడు మురుగ దాస్ మలిచారని, మహేష్ చక్కని పెర్ఫార్మెన్స్ చేశాడని, మొత్తం స్పైడర్ టీంకు అభినందనలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ అన్నారు. ఇది "స్పైడర్" కు లభించిన అమూల్యమైన గౌరవం. వారాంతం, దసరా సెలవులు టాక్ తో సంబందం లేకుండా కలెక్షన్స్ రాబట్టడానికి దోహదం చేస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి