నటనలోనే కాదు, సినిమాలు చేయడంలోను దూకుడు మీద వుండే రవితేజ - రెండు సంవత్సరాల విరామం అనంతరం విడుదలైన చిత్రం "రాజ ది గ్రేట్". 12 సంవత్సరాల తరువాత దిల్ రాజు తో రవితేజ చేసిన చిత్రంగా కూడా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన కలయిక ఇది. పటాస్, సుప్రీం చిత్రాలతో జోరు మీద వున్న అనిల్ రావిపూడి దీనికి దర్శకుడు. రొటీన్ కథకు వెరైటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అయిందనే అంటున్నారు ప్రేక్షకులు. మాస్ మహారాజాగా మన్ననలు పొందుతున్న రవితేజలాంటి హీరో చేత పూర్తి నిడివి అంధత్వంగల పాత్ర చేయించడమన్నది ప్రయోగమే. అయినప్పటికి ఆ పాత్రపై ప్రేక్షకులకు సింపతీ ఏర్పడకుండా జోష్ మీద నటించి క్రెడిట్ కొట్టేసాడు రవితేజ. చాల గాప్ తరువాత వచ్చినా న్యూ లుక్ తో, ఫుల్ ఎనర్జిటిక్ గా చేసాడని యూత్ ఆడియన్స్ కితాబిస్తున్నారు. ఇన్ని రోజుల విరామం తీసుకున్నది మొనాటని బ్రేక్ చేయడానికే అన్న రవితేజ మాటలలాగే ఈ చిత్రం "రవి తేజ వన్ మాన్ షో" అనిపించుకుంటుంది. రవితేజ ను 50 కోట్ల కలెక్షన్స్ లో చేర్చే మొట్ట మొదటి చిత్రం ఇదే కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి