"ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగ చైతన్య, సమంతలు నిజ జీవితంలో కూడా ప్రేమ పెళ్ళితో ఒక్కటయ్యారు. కీ. అక్కినేని నాగేశ్వరరావు అంతగా చదువుకోకపోయినా, విశాల దృక్పథం కలిగి, సినీ పరిశ్రమలో ఆదర్శప్రాయ జీవితం గడిపారు.తన కుమారుల ఇష్టాలను గౌరవించి, వారికి తమ జీవితాలను తీర్చి దిద్దుకోవడంలో పూర్తి స్వేచ్చను ఇచ్చారు. ఆ స్వేచ్చతోనే నాగార్జున సినిమా హీరోగా నిలదొక్కుకోని, తనతోపాటు హీరోయిన్ గా నటించిన అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున అదే స్వేచ్చను తన కుమారుడు చైతన్యకు కూడా వారసత్వంగా ఇచ్చారు. తొలుత ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ గా రాణించడానికి ఇష్టపడిన చైతన్య, తదుపరి సినిమాలపై ఆసక్తితో హీరోగా రూపాంతరం చెందాడు. తండ్రి నాగార్జున బాటలోనే పయనిస్తూ- తన తొలి చిత్ర నాయకి సమంతతో ప్రేమలో మునిగి, ఇరు పెద్దల అంగీకారంతో ఆమెను అర్ధాంగిగా చేసుకున్నాడు.. అమితాబ్-జయభాదురి, కృష్ణ-విజయనిర్మల, నాగార్జున-అమల, రాజశేఖర్-జీవిత, అజిత్-షాలిని, సూర్య-జ్యోతిక తదితర సినీ దంపతులులా వీరు కూడా చిరకాలం దాంపత్యం సాగించాలని ఆకాంక్షిద్దాం, ఆశీర్వదిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి