బాహుబలి 2 తదుపరి విడుదలైన పెద్ద సినిమాలు దువ్వాడ జగన్నాదం, పైసా వసూల్ పరిశ్రమకు వసూళ్ళ వుత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ మద్యలో నిన్నుకోరి, ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మా, అర్జున్ రెడ్డి లాంటి చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను కొంచెం కళ కళ లాడించాయి. ఇప్పుడు మళ్ళీ బాక్సాఫీస్ రికార్డ్ లెక్కలను సవరించుకొనే సమయం వచ్చేసింది. జూనియర్ ఎన్ టి ఆర్ తొలిసారిగా కుటుంబ సంస్థ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ లో రవీంద్ర దర్శకత్వంలో నటించిన "జై లవ కుశ" ఈ నెల 21 న విడుదల కానుంది. ఇందులో ఎన్ టి ఆర్ మూడు పాత్రల లో నటించడం విశేషం. అదే విధంగా మహేష్ బాబు, ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించిన"సైడర్" కూడా ఈ నెల 27 న విడుదలకు రంగం సిద్దం అయ్యింది. బాహుబలి 2 తదుపరి అత్యధిక వ్యయంతో తెలుగులో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి తెరపంచుకొంటోంది. దసరాకు కనుల విందుకు సిద్ధమైన ఈ చిత్రాలు - టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ లను నెలకొల్పడం ఖాయం అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి