100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తదుపరి నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ తో చిత్రం అనౌన్స్ చేయగానే పరిశ్రమలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇద్దరూ డిఫరెంట్ స్కూల్స్ అవడంతో ఎవరు ఎవరి శైలి ఫాలో అవుతారో అన్న ఉత్కంఠకు శుక్రవారంతో తెర పడింది. "పైసా వసూల్" లో బాలకృష్ణను డిఫెరెంట్ గా చూపడంలో పూరీ కృతకృత్యుడయ్యాడు. కాకపోతే పూరీ మాత్రం తన మూస ధోరణి నుండి బయటపడలేక, సినిమా అంతా తన గత చిత్రాల వాసనలతో నింపేశాడంటున్నారు. ఫస్ట్ హాఫ్ ను రసవత్తరంగా మలచినా, సినిమాకు ప్రాణం అయిన సెకండ్ హాఫ్ ను ఆ మేరకు రక్తి కట్టించలేక పోయాడు. పూరీ చిత్రాలలో చిత్రం జయాపజయాలకు అతీతంగా, హీరోయిన్, విలన్ పాత్రలు, సాంగ్స్ కు ప్రత్యేకత వుంటుంది. ఈ చిత్రంలో వాటికీ న్యాయం చేయలేక పోయాడంటున్నారు. బాలకృష్ణలాంటి సీనియర్ హీరో పూరి దర్శకత్వంలో ఎటువంటి భేషజం లేకుండా ఒదిగిపోయి నటించడమన్నది అభినందించాల్సిన విషయం. ఫైనల్ గా "పైసా వసూల్" ఫక్తు బాలకృష్ణ అభిమానుల చిత్రంగా తేల్చేశారు ప్రేక్షకులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి