తెలుగు చిత్ర రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ "శివ". నాగార్జున, వర్మల తొలి కలయికలో వచ్చిన ఈ చిత్ర ప్రభావం నేటి చిత్రాలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. తరువాత వీరి కలయికలో అంతం, గోవిందా..గోవిందా.. చిత్రాలు వచ్చాయి. ఆ తదుపరి వర్మ బాలివుడ్ లో బిజీ అవడం, టాలివుడ్ కు తిరిగివచ్చినా పెద్ద చిత్రాలు ఏవీ చేయక పోవడంతో ఈ జోడీ కుదరలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల విరామం తరువాత నాగార్జున అభిమానుల కోరిక తీరనున్నది. వర్మతో చిత్రాన్ని కంఫర్మ్ చేసిన నాగార్జున కొన్ని కండిషన్స్ వర్మ ముందుంచారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి సమయం కేటాయించాలని, చిత్రం పూర్తి అయ్యే వరకు మరే ప్రాజెక్ట్ చేపట్టకూడదని నాగార్జున చెప్పిన మీదట వర్మ తన పూర్తి అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తుంది. ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారు. ఈ నెలలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం జరగనున్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి