దక్షిణాదిలో నిర్మితమైన తొలి తరం సినిమా హాళ్ళలో వైజాగ్ లోని పూర్ణ ధియేటర్ ఒకటి. 1927 లో సి.పుల్లయ్య మరియు జి.కె.మంగరాజు ల భాగస్వామ్యంలో తొలుత శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ గా నిర్మితమైనది. సి.పుల్లయ్య సినీ పరిశ్రమకు తరలి వెళ్ళి దర్శకుడిగా స్థిర పడిపోవడంతో - 1930 లో పూర్ణ ధియేటర్ గా పేరు మార్పుచెంది మంగరాజు పూర్తి యాజమాన్యంలోకి వచ్చింది.
1949 లో నూతనంగా నిర్మించిన బాల్కనీ - "లైలా మజ్ను" చిత్రంతో పాటు గా, ఆ చిత్రం లో హీరొయిన్ గా నటించిన భానుమతి రామకృష్ణ తో ప్రారంభోత్సవం జరుపుకుంది. తదుపరి ధియేటర్ రంగం లో వచ్చిన సాంకేతిక మార్పులను అన్వయించుకుంటూ ప్రేక్షకులను దశాబ్దాలు గా అలరించింది. ఒకానొక దశలో ఒక్కసారిగా పుంజుకున్న సాంకేతిక వేగాన్ని అందుకోలేక కొద్ది కొద్దిగా వెనుకంజలో పడింది. ఒక ప్రక్క మల్టిప్లెక్స్ లు, మరోప్రక్క కేబుల్ టీవీ ప్రభావాలను తట్టుకొని నిలబడిన పూర్ణ ధియేటర్ 2015 సంవత్సరం లో మూతపడింది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా విశాఖ ప్రేక్షకులను అలరించిన పూర్ణ ధియేటర్ వైభవం నేడు గత చరిత్ర ఆనవాళ్ళు గా మిగిలిపోయింది. సమీపంలోని సర్దార్ వల్లభాయ్ మార్కెట్ పేరు పూర్ణ మార్కెట్ గా రూపాంతరం చెంది విశాఖ చరిత్రలో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఈ ధియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులారా...! నాటి జ్ఞాపకాలలో మునిగిపోయారా...? ఈ ఆనవాళ్ళు కూడా గత జ్ఞాపకాలు గా మారిపోయే కాలం మరెంతో దూరంలో లేదు. వ్రేళ్ళ మీద లెక్కించగలిగేలా మాత్రమే మిగిలి ఉన్న అలనాటి సినిమా హాళ్ళను పరిరక్షించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ నడుంబిగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఆశయం కార్యాచరణలోకి వస్తే తెలుగు సినిమా ప్రేక్షకుల ఆనందానికి హద్దేముంటుంది...!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి